Heavy Rains: చిగురుటాకులా చెన్నై.. చెన్నై సహా 4 జిల్లాలకు కొనసాగుతున్న ఎల్లో అలర్ట్

Chennai Rains: వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.

Update: 2024-10-17 04:59 GMT

Heavy Rains: చిగురుటాకులా చెన్నై.. చెన్నై సహా 4 జిల్లాలకు కొనసాగుతున్న ఎల్లో అలర్ట్

Chennai Rains: వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. తూత్తూకుడి, తిరునల్వేలి జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో.. పోర్టు ప్రాంతాల్లో నాలుగో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో చెన్నైలోని పలు ఏరియాల్లో రికార్డు వర్షపాతం నమోదైందని ఐఎండీ ప్రాంతీయ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ముంచెత్తుతున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు డ్యాములు నిండుకుండల్లా మారుతున్నాయి. వర్షపునీరు రోడ్లపై పొంగిపొర్లడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం, మధురై సహా పలు ప్రాంతాల్లో వీధులను వరద ముంచెత్తింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలకూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారుల నివాసాల్లోకి సముద్రపునీరు చేరటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Tags:    

Similar News