తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

Heavy Rains: హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శా‌ఖ అధికారులు

Update: 2022-10-11 02:34 GMT

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు 

Heavy Rains: తెలుగు రాష్ట్రాలు మళ్లీ అలర్ట్ అవ్వాల్సిందే.. మొన్న కురిసిన భారీ వర్షాలు... ఎగువ నుంచి వచ్చిన వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికీ కొన్ని ముంపు ప్రాంతాలు వరదల నుంచి తేరుకోలేదు.. అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు పాటు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉత్తర, దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించింది.

అమరావతి వాతారణ కేంద్రం సూచన ప్రకారం.. రానున్న నాలుగు రోజులపాటు ఆంధ‌్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర - దక్షిణ ద్రోణి ప్రభావంతో దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ వరకు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు విస్తరించిందని వాతావరణ శాఖ తమ నివేదికలో పేర్కొంది.

దీంతో రాబోయే నాలుగురోజులపాటు వివిధ ప్రాంతాలకు భారీ వర్ష సూచన చెప్పింది వాతావరణ శాఖ... ఉత్తరకోస్తాంధ్ర, యానాంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జుల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు వాతావారణ శాఖ అధికారులు.

రాయలసీమలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు... బుధవారం నుంచి ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉంది. అదే సమయంలో మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గురువారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురుస్తాయన్నారు. ఉరుములతో కూడిన, భారీ వర్షాలు కొన్నిచోట్ల కురుస్తాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.

Full View
Tags:    

Similar News