PM Modi: ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్‌ కాదు.. తుపాను..

PM Modi: ఎన్డీయే కూటమి ఎంపీలు ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో మోడీని మూడోసారి ప్రధానిగా ప్రతిపాదిస్తూ.. లాంఛనంగా ఆమోదముద్ర వేశారు.

Update: 2024-06-07 08:45 GMT

PM Modi: ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్‌ కాదు.. తుపాను..

PM Modi: ఎన్డీయే కూటమి ఎంపీలు ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో మోడీని మూడోసారి ప్రధానిగా ప్రతిపాదిస్తూ.. లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. మొదట రాజ్‌నాథ్‌సింగ్ ప్రధానిగా మోడీ పేరు ప్రస్తావించగా.. వెంటనే అమిత్ షా, నితిన్ గడ్కరీ, నితీష్ కుమార్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలువురు నేతలు ఆమోదిస్తూ మద్దతు తెలిపారు. మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. మద్దతుగా నిలిచిన మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇక్కడ కూర్చొన్న వ్యక్తి పవన్‌ కాదు.. తుపాన్‌ అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు.

Tags:    

Similar News