Election Results: హరియాణాలో హస్తం హవా...జమ్మూకశ్మీర్లో దూసుకెళ్తోన్న నేషనల్ కాన్ఫరేన్స్

Election Results:హర్యానా- జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుండి కొనసాగుతోంది.

Update: 2024-10-08 04:41 GMT

Election Results: హరియాణాలో హస్తం హవా...జమ్మూకశ్మీర్లో దూసుకెళ్తోన్న నేషనల్ కాన్ఫరేన్స్

Election Results: హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం హర్యాణాలో హస్తం పార్టీ జోరు కనబరుస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..బీజేపీ కూడా గట్టిపోటీనిస్తోంది. ప్రస్తుతం 29 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఒక స్థానంలో, ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.

జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ముందంజలో ఉంది. బీజేపీ, పీడీపీలు వెనుకబడి ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 90-90 స్థానాలకు పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఓటింగ్ జరిగింది. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలుపుకోగలదని విశ్వాసంతో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లో కూడా కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ, పీడీపీలు విజయం సాధించాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

హర్యానాలో సీఎం నయాబ్ సింగ్ సైనీ లాడ్వాలో ముందంజలో ఉండగా...జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్‌ చౌతాలా డబ్వాలీ లో వెనుకంజలో ఉన్నారు. అంబాలా కంటోన్మెంట్‌లో హర్యానా మంత్రి అనిల్‌ విజ్‌ వెనుకంజలో ఉండగా..హిసార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ దూసుకెళ్తున్నారు. 

Tags:    

Similar News