ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు జారీ చేసిన కేంద్రం
ఇ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత్ లో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లు తమ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఉత్పత్తుల గురించి 'తప్పనిసరి' సమాచారాన్ని చూపించడం..
ఇ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత్ లో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లు తమ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఉత్పత్తుల గురించి 'తప్పనిసరి' సమాచారాన్ని చూపించడం లేదని ప్రభుత్వం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులు జారీ చేయడంతో పాటు, అన్ని ఇ-కామర్స్ కంపెనీలు నిబంధనలను పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరింది. మరోవైపు కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటీసుల అంశంపై రెండు సంస్థలు స్పందన తెలియజేయలేదు.
కాగా మంత్రిత్వశాఖ ఇచ్చిన నోటీసులపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఉంది. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలకు లోబడి ఉండేలా అన్ని ఇ-కామర్స్ సంస్థలు ఉండాలని ఆదేశించింది. లీగల్ మెట్రాలజీ రూల్స్, 2011 ప్రకారం అవసరమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కొన్ని ఇ-కామర్స్ సంస్థలు తప్పనిసరి డిక్లరేషన్‌ను ప్రదర్శించడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసులో పేర్కొంది. ఇ-కామర్స్ కోసం ఉపయోగించే డిజిటల్ , ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్‌లో అన్ని తప్పనిసరి డిక్లరేషన్లు ప్రదర్శించబడాలని సూచించింది.