Twitter: కేంద్రం ట్విట్టర్ మధ్య ముదురుతున్న వివాదం
Twitter: కేంద్రం వర్సెస్ ట్విట్టర్ వార్ ఎపిసోడ్ పీక్స్‌కు చేరింది.
Twitter: కేంద్రం వర్సెస్ ట్విట్టర్ వార్ ఎపిసోడ్ పీక్స్‌కు చేరింది. భారత కొత్త ఐటీ రూల్స్‌ను వ్యతిరేకిస్తు వచ్చిన ట్విట్టర్ ఇవాళ ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికే షాకిచ్చింది. వెంకయ్య ఫర్సనల్ ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫైడ్ బ్యాడ్జ్ అయిన బ్లూ టిక్‌ను తొలగించింది. దీంతో మరోసారి కేంద్రం వర్సెస్ ట్విట్టర్ ఎపిసోడ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు షాక్ ఇచ్చింది. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్‌ను తొలగించింది. గత ఆరు నెలల నుంచి వెంకయ్య వ్యక్తిగత ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఖాతా నుంచి వెంకయ్య చివరిసారి గతేడాది జులై 23న ట్వీట్ చేశారు. అయితే, ఉపరాష్ట్రపతి అధికారిక అకౌంట్ @VPSecretariatకు మాత్రం బ్లూటిక్ యథావిధిగా ఉంది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఉపరాష్ట్రపతి కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్విట్టర్ కొద్ది గంటల్లోనే బ్లూ టిక్‌ను పునరుద్దరించింది.
మరోవైపు ఉపరాష్ట్రపతి ఎకౌంట్‌కు బ్లూటిక్‌ను పునరుద్ధించిన గంటల వ్యవధిలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్సనల్ అకౌంట్ నుంచి బ్లూటిక్‌ను తొలగించింది. మోహన్ భగవత్‌తోపాటు సురేశ్ భయ్యాజీ జోషి, గోపాలకృష్ణ, అరుణ్ కుమార్, సురేశ్ సోనీ బ్లూటిక్‌ను కూడా ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది. దీనిపై సంఘ్ నేతలు స్పందించారు. కొన్ని రోజులుగా ట్విట్టర్ యాజమాన్యం చాలా మంది సంఘ నేతల బ్లూ టిక్‌ను తొలగించిందని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ట్విట్టర్‌కు కేంద్ర సర్కార్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ చట్టం నిబంధనల ప్రకారం భారతీయుడిని గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది. వెంటనే కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసని హెచ్చరించింది.