ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉపయోగంపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించింది. అసభ్య, అశ్లీల హింసాత్మక కంటెంట్‌పై కేంద్రం నిషేదం విధించింది. మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించేలా ఉన్న కంటెంట్‌ను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. మహిళలపై వస్తున్న అభ్యంతరకర వీడియోలను ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా తొలగించాలని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం ఆదేశించింది.