India: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
India: పే ఫిక్సేషన్ గడువును 3 నెలలు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
India: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పే ఫిక్సేషన్ గడువును పొడిగిస్తూ.. ప్రకటన జారీ చేసింది. ఈమేరకు ఆర్థిక శాఖ పే ఫిక్సేషన్ పై ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. పే ఫిక్సేషన్ గడువును 3 నెలలు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. దీని వల్ల చాలా మంది ఉద్యోగులకు ఊరట లభించినట్లైంది. ఉద్యోగులు కేంద్రానికి డెడ్‌లైన్ పొడిగించాలని ఇదివరకే కోరారు. ఈనేపథ్యంలో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ డేట్ ఆధారంగా ఫిక్స్‌డ్ చెల్లింపులు పొందాలా? లేదా ఇంక్రిమెంట్ డేట్ ఆధారంగా స్థిర చెల్లింపులు పొందాలా? అనే ఆప్షన్ ఎంచుకునేందుకు ఎక్కువ సమయం అందుబాటులోకి వచ్చింది. మరోసారి గడువు పొడిగింపు ఉండబోదని ఈ మేరకు కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు జులై 1 నుంచి అమలులోకి రానుంది. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏను పెండింగ్‌లో పెట్టిన విషయం మనకు తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న డీఏలను అన్నీ కలిపి ఒకేసారి చెల్లించనుంది. దీంతో ఉద్యోగుల డీఏ భారీగా పెరగనుందని తెలుస్తోంది. అంచనాల మేరకు 28 శాతానికి డీఏ పెరగవచ్చని తెలుస్తోంది.