దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న బంగారం

* ముగ్గురు నిందితులు అరెస్ట్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు

Update: 2023-03-12 07:40 GMT

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న బంగారం 

Gold Seized: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భారీగా అక్రమ బంగారం పట్టుబడుతూనే ఉంది. దేశంలో గోల్డ్‌కు ఫుల్ డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు వివిధ మార్గాల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్క్షానం అందుబాటులోకి రావడంతో అధికారులు ఎయిర్‌పోర్టుల్లో బంగారాన్ని పట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల దగ్గరి నుంచి 3 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. మార్చి 10న అడిస్ అబాబా నుంచి ముంబై వచ్చిన విదేశీ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి 3కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దాని విలువ దాదాపు ఒక కోటీ 40 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. లో దుస్తులు, షూలలో రహస్యంగా దాచి బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన అధికారులు...ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 

Tags:    

Similar News