కొత్త రాజకీయ పార్టీపై గులాంనబీ ఆజాద్ సన్నాహాలు.. పార్టీపేరు పరిశీలనలో తర్జన భర్జన
Ghulam Nabi Azad: రాజకీయ పార్టీ పేరుకోసం 1500 పేర్ల పరిశీలన
Ghulam Nabi Azad: కొత్త రాజకీయ పార్టీపై సీనియర్ రాజకీయ నాయకులు గులాంనబి అజాద్ కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీ పేరుపై 1500 పేర్లు ప్రతిపాదనలోకి వచ్చాయని తెలిపారు. హిందుస్థానీ పేరును ఖరారు చేసేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశీయంగా రాజకీయ పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ అవసరమని కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయసంకల్పించామన్నారు.