నేటి నుంచి బాలిలో జీ20 సదస్సు... పాల్గొననున్న 20దేశాల అధిపతులు!

* కరోనా, ఇంధన సవాళ్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యంపై చర్చ.... బాలిలో మోడీకి ఘన స్వాగతం

Update: 2022-11-15 04:04 GMT

నేటి నుంచి బాలిలో జీ20 సదస్సు

Prime Minister Narendra Modi: నేటి నుంచి జీ 20 సదస్సు ప్రారంభం కానుంది. రెండురోజుల పాటు జరిగే సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు 20 దేశాల యూరోపియన్ యూనియన్లకు చెందిన అధిపతులు సదస్సులో పాల్గొంటారు. కరోనా, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి అనేక అంశాలపై జీ 20 దేశాలు రెండు రోజుల పాటు చర్చిస్తాయి.

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఇండోనేషియా రాజధాని బాలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఇండోనేషియా ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఆ దేశ సంప్రాదాయం ప్రకారం మోడీని స్వాగతించింది. జీ20 సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచ నేతలతో మోడీ సమావేశమవుతారు. వచ్చే ఏడాది జీ20 సదస్సు భారత్‌లోని కశ్మీర్‌లో జరగనుంది. ఇందులో భాగంగా జీ20 నిర్వహణ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరిస్తుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags:    

Similar News