మహిళలకి ఉచిత స్మార్ట్‌ఫోన్.. 3 సంవత్సరాల ఉచిత కాలింగ్, ఇంటర్నెట్..!
మహిళలకి ఉచిత స్మార్ట్‌ఫోన్.. 3 సంవత్సరాల ఉచిత కాలింగ్, ఇంటర్నెట్..!
Free Smartphone: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఊరికే రావు. వేలకు వేలు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వమే మీకు ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తే ఎలా ఉంటుంది.. ఎప్పుడైనా ఆలోచించారా.. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇప్పుడు ఇది సాధ్యమే. వాస్తవానికి రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అంటే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటికోసం పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. రాజస్థాన్ ప్రభుత్వం తన ఓటర్లకు సహాయం చేయడానికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉచిత స్మార్ట్ ఫోన్లను అందజేస్తానని హామీ ఇచ్చింది.
అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు స్వయంచాలకంగా ఇన్‌స్టాల్ అవుతాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రభుత్వం తన పాలనా ప్రచారం చేసుకుంటుంది. మొబైల్‌లో ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయ్యే యాప్‌లు డిలీట్ కావు. కాబట్టి ఈ యాప్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్‌ను కూడా రన్ చేయాలి. ఉత్తరప్రదేశ్‌లో ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసిన విధంగానే ఈ స్మార్ట్‌ఫోన్‌లని పంపిణీ చేస్తారు. వీటిలో ప్రభుత్వ ప్రచార వాల్‌పేపర్‌లతో పాటు పార్టీ నినాదాలు ఉంటాయి.
ప్రభుత్వం కోట్లాది మంది మహిళలకు పంపిణీ చేయబోయే స్మార్ట్‌ఫోన్ ఏ మోడల్ అయి ఉంటుందని అందరు ఆలోచిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వాలంటే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లు ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు అని చెబుతున్నారు. వీటి ధర ₹ 7000 నుంచి ₹ 10000 వరకు ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో సాధారణ కెమెరా, డిస్‌ప్లేతో సహా డీసెంట్ స్పీడ్ ప్రాసెసర్‌తో అందిస్తారు. కాలింగ్, ఇంటర్నెట్ 3 సంవత్సరాల పాటు ఉచితంగా లభిస్తుంది.