ఢిల్లీలో కొనసాగుతోన్న రైతు నిరసనలు

* 38వ రోజుకు చేరిన అన్నదాత ఆందోళనలు * జనవరి 4న కేంద్రంతో మరో దఫా చర్చలు * పురోగతి లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

Update: 2021-01-02 02:51 GMT

ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నగరమంతా చలికి వణికిపోతున్నా రైతులు మాత్రం తమ పట్టు వీడటం లేదు. చట్టాలు రద్దు చేసేవరకు వెనక్కి తగ్గేది లేదంటూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.

ఇవాళ్టితో రైతుల నిరసన కార్యక్రమం 38వ రోజుకు చేరింది. సింఘు, టిక్రి, ఘాజిపూర్ సరిహద్దుల దగ్గర బైఠాయించి అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో 15ఏళ్లలో ఎప్పుడూ లేనంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనా అవేమీ లెక్కచేయకుండా నిరసనలు చేస్తున్నారు రైతులు. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ కేంద్రం, అన్నదాతల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడటం లేదు.

అయితే ఈ నేపథ్యంలో కేంద్రానికి రైతులు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎల్లుండి జరిగే చర్చల్లో పురోగతి లేకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామన్నారు రైతు సంఘాల నేతలు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో కేవలం 5శాతం సమస్యలనే ప్రభుత్వం దృష్టికి అన్నదాతలు చెప్పారు. జనవరి 4న సమావేశంలో సానుకూల నిర్ణయం ఉండకపోతే జనవరి 6న ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని రైతుల ప్రతినిధి యుధ్వీర్ సింగ్ అన్నారు. హర్యానా- రాజస్థాన్​ బార్డర్స్‌లోని రైతులు భారీ సంఖ్యలో ఢిల్లీని ముట్టడిస్తారని హెచ్చరించారు. హర్యానా షాపింగ్​ మాళ్లు, పెట్రోల్​ బంకులు బంద్​ చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News