Buddhadev Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

Buddhadev Bhattacharya passed away:పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు.

Update: 2024-08-08 05:23 GMT

Buddhadev Bhattacharya passed away: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

Buddhadev Bhattacharya passed away: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. భట్టాచార్య 80 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. గురువారం ఆయన మృతి వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు.పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. గురువారం బుద్ధదేవ్ భట్టాచార్య మృతి వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. బుద్ధదేవ్ భట్టాచార్య నవంబర్ 2000 నుంచి మే 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య  సిపిఎం అత్యున్నత నిర్ణయాధికార సంస్థ  పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు. 2011 రాష్ట్ర ఎన్నికలలో మమతా బెనర్జీ పార్టీ TMC వామపక్ష పాలనకు ముగింపు పలికింది. బుద్ధదేవ్ భట్టాచార్య పార్టీ ఓటమితో బెంగాల్‌లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలన ముగిసింది. భట్టాచార్య దక్షిణ కోల్ కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఒక చిన్న రెండు గదుల ప్రభుత్వ అపార్ట్ మెంట్లో నివసిస్తున్నారు. 

2011 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన బుద్ధదేవ్ 2015లో సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2018లో రాష్ట్ర సచివాలయ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. 2000లో పార్టీ సీనియర్ నేత జ్యోతిబసు నుంచి బుద్ధదేవ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుద్ధదేవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే  నందిగ్రామ్, సింగూరు కాల్పులు జరిగాయి.

అటు మాజీ సీఎం మృతి పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సంతాపం వ్యక్తం చేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య మన మధ్య లేరని సువేందు ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు  శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేవారు. వీరితో పాటు పలువురు నేతలు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News