కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత మునిరత్న అరెస్ట్
రూ.30లక్షల కమీషన్ కోసం వేధించారని ఆరోపణ
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత మునిరత్న అరెస్టయ్యారు. పనులు ఇప్పించేందుకు ఓ కాంట్రాక్టర్‌ను 30 లక్షల రూపాయల కమీషన్ కోసం వేధించారనే ఆరోపణలున్నాయి. వీటికి సంబంధించిన బెదిరింపు ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కోలారు పోలీసులు.. మునిరత్నను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక బీజేపీ మునిరత్నకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది.