తొలిసారి సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం
*జస్టిస్ ఎన్వీరమణ బెంచ్ విచారణలు ప్రత్యక్షప్రసారం
Supreme Court: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే క్రమంలో కీలక ముందడుగు పడింది. కోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ ధర్మాసనం విచారణ ప్రత్యక్ష ప్రసారానికి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు.