Ration Card: రేషన్‌కార్డు ఉందా.. సులువుగా వారి పేరు తొలగించండి లేదంటే నష్టమే..!

Ration Card: రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైన పత్రం. దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రతి నెల ఉచిత రేషన్ పొందుతారు.

Update: 2022-08-13 08:56 GMT

Ration Card: రేషన్‌కార్డు ఉందా.. సులువుగా వారి పేరు తొలగించండి లేదంటే నష్టమే..!

Ration Card: రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైన పత్రం. దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రతి నెల ఉచిత రేషన్ పొందుతారు. మీరు కూడా రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ విషయం తెలుసుకోండి. ఇప్పుడు మీరు రేషన్‌లో ఎలాంటి మార్పు చేయాలనుకున్నా సులువుగా చేయవచ్చు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లని చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా సులువుగా చేయవచ్చు.

ఇంట్లో బిడ్డ పుట్టినా, కొత్త కోడలు వచ్చినా రేషన్‌కార్డులో పేరు నమోదు చేయడం ముఖ్యం. అలాగే కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల పేరును రేషన్ కార్డు నుంచి తొలగించడం అవసరం. ఇది కాకుండా ఒక వ్యక్తి మరొక నగరానికి బదిలీ అయిన సందర్భంలో రేషన్ కార్డు నుంచి పేరును తీసివేయడం అవసరం. రేషన్ కార్డ్ నుంచి పేరును తీసివేయడానికి మీరు కొన్ని సులభమైన దశలను అనుసరించాలి. దాని గురించి తెలుసుకుందాం.

ఈ పత్రాలు అవసరం

1. రేషన్ కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డ్

2. రేషన్ కార్డ్ హోల్డర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో

3. మరణించిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం

4. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు

రేషన్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలి..?

1. రేషన్ కార్డు నుంచి కుటుంబ సభ్యుల పేరును తీసివేయడానికి ముందుగా ఆ రాష్ట్ర రేషన్ వెబ్‌సైట్‌కి లాగిన్ కావాలి.

2. ఆ తర్వాత రేషన్ కార్డ్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. తరువాత కుటుంబ సభ్యుల పేరును తొలగించే ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

4. తరువాత అడిగిన పత్రాల సమాచారాన్ని అందించండి.

5. తర్వాత రేషన్ కార్డులో ఆ కుటుంబ సభ్యుల పేరు తొలగిస్తారు.

Tags:    

Similar News