Narendra Modi: కరోనా నేపథ్యంలో సీఎంలతో ప్రధాని వర్చువల్‌ మీట్‌

Narendra Modi: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ మీట్ నిర్వహించారు.

Update: 2021-03-17 16:15 GMT

కరోనా నేపథ్యంలో సీఎంలతో ప్రధాని వర్చువల్‌ మీట్‌

Narendra Modi: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి బెంగాల్, చత్తీస్‌గఢ్ సీఎంలు గైర్హాజరయ్యారు. దేశ ప్రజలంతా అత్యంత క్రియాశీలకంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని సమావేశంలో ప్రధాని చెప్పారు. అవసరమున్న చోట్ల మైక్రో కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

టెస్టింగ్‌, ట్రేసింగ్‌ బాగా పెంచాలని రాష్ట్రాలకు సూచించారు ప్రధాని. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను కూడా పెంచాలని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర్రాల్లో పది శాతం టీకాలు వేస్టయినట్లు తెలిపారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయవద్దని సూచించారు. ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్దామని అలాగని అతి ఆత్మవిశ్వాసం కూడదని హెచ్చరించారు. రెండో దశ కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సీఎంలకు సూచించారు ప్రధాని మోడీ. 

Tags:    

Similar News