Gas Leak: పాఠశాలలో గ్యాస్ లీక్..అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు..ఆసుపత్రిలో చికిత్స

Gas Leak: చెన్నైలోని ఓ పాఠశాలలో గ్యాస్ లీక్ కావడంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Update: 2024-10-26 01:52 GMT

Gas Leak: పాఠశాలలో గ్యాస్ లీక్..అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు..ఆసుపత్రిలో చికిత్స

Gas Leak: చెన్నై నగరంలోని ఓ పాఠశాలలో గ్యాస్‌ లీక్‌ అయిన ఘటన వెలుగు చూసింది. గ్యాస్ లీక్ అవ్వడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో జరిగింది.

30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అసౌకర్యం, గొంతు చికాకును సమస్యను ఎదుర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించింది పాఠశాల యాజమాన్యం. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

NDRF కమాండర్ AK చౌహాన్ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన కచ్చితమైన కారణం తెలియలేదు. మా బృందం పాఠశాలకు వచ్చి పరిస్థితిని అంచనా వేసింది. ప్రతిదీ సాధారణంగానే ఉంది. ఏసీ నుంచి గ్యాస్ లీకేజీ అనేది కనిపించలేదు అన్నారు.

అయితే అస్వస్థతకు గురైన ఓ విద్యార్థి మాట్లాడుతూ..మాలో కొంతమంది స్వచ్చమైన గాలిని పీల్చుకునేందుకు క్లాస్ నుంచి బయటకు వచ్చాము. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే మా టీచర్లు వారిని ఆసుపత్రికి తరలించారు అని చెప్పుకొచ్చాడు.



30 మంది విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం అంబులెన్స్ కు సమాచారం అందించింది. విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ పాఠశాల నుంచి లీకేజీ వచ్చిందా లేక కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న దాని పరిసర ప్రాంతం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని తెలిపారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిపై పాఠశాల అధికారులు స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. 

Tags:    

Similar News