Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్‌పై పట్టు బిగించిన NIA..సమాచారం ఇస్తే రూ.10లక్షల రివార్డు
Lawrence Bishnoi: లారెన్స్ బిష్షోయ్ సోదరుడు అన్మోల్ పై NIA రూ. 10లక్షల రివార్డును ప్రకటించింది. బాబా సిద్దిఖీ హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఎన్ఐఏ అతనిపై పట్టుబిగించింది.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్షోయ్ సోదరుడు అన్మోల్ పై NIA రూ. 10లక్షల రివార్డును ప్రకటించింది. బాబా సిద్దిఖీ హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఎన్ఐఏ అతనిపై పట్టుబిగించింది.
మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వంటి కారణాలతో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలోనే లారెన్స్ సోదరుడు అన్మోల్ పై ఎన్ఐఏ రూ. 10లక్షల రివార్డును ప్రకటించింది.
2022లో నమోదు అయిన రెండు కేసుల్లో అతనిపై అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు సిద్దిఖీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈక్రమంలోనే అన్మోల్ గురించి సమాచారం అందించినవారికి ఈ రివార్డును ప్రకటిస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. ఆ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
2022లో ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. ఆ కేసులో కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అన్మోల్ పై దాదాపు 18 కేసులు ఉన్నాయి. భాను పేరుతో చెలామణి అవుతున్న అన్మోల్ నకిలీ పాస్ పోర్టుతో దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత గత ఏడాది కెన్యా..ఈ ఏడాది కెనడాలో కనిపించాడు.