School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..దీపావళి పండగకు 6 రోజులు సెలవులు..పూర్తి వివరాలివే

School Holidays: దీపావళి పండగ సందర్భంగా విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఏకంగా 6రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 రోజులు దీపావళి పండగ సెలవులు కాగా..ఒక రోజు ఆదివారం కావడంతో మొత్తం 6 రోజుల పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీపావళి పండగను పురస్కరించుకుని ఈ సారి మొత్తం 6రోజులు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Update: 2024-10-24 02:08 GMT

School Holidays

School Holidays: దీపావళి పండగ సందర్భంగా విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఏకంగా 6రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 రోజులు దీపావళి పండగ సెలవులు కాగా..ఒక రోజు ఆదివారం కావడంతో మొత్తం 6 రోజుల పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీపావళి పండగను పురస్కరించుకుని ఈ సారి మొత్తం 6రోజులు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దివాళీ సందర్భంగా సెలవులు ప్రకటించారు. నవంబర్ 3వ తేదీన ఆదివారం కావడంతో నవంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో మొత్తంగా దీపావళి 6రోజులు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. అయితే 6 రోజులు సెలవులు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన జమ్మూకాశ్మీర్ కావడం గమనార్హం.

జమ్మూ కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా నేత్రుత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం దీపావళి పండగను పురస్కరించుకుని 5రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇచ్చింది. ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో మొత్తంగా 6రోజులు విద్యార్థులకు సెలవులు దొరకనున్నాయి. ఈమేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్మూసెలువలకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.

ఉత్తర్వుల ప్రకారం జమ్మూలో అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీపావళి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News