ISRO: రేపు తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం

* ఇస్రో చరిత్రలో సరికొత్త అధ్యాయం.. శ్రీహరికోటలోని షార్‌లో ప్రయోగం

Update: 2022-11-17 03:06 GMT

రేపు తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం

ISRO: భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. భారత్‌లో ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తయారు చేసిన ఈ రాకెట్‌ను ఇస్రో రేపు అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ వేదికకానుంది. ఈ నెల 12నే ఈ ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇది మొదట ఈ నెల 15కి, ఆ తర్వాత 18కి వాయిదా పడింది. దివంగత శాస్త్రవేత్త విక్రమ్‌ సారాబాయికి నివాళిగా ఈ రాకెట్‌కు విక్రమ్‌-ఎస్‌ అని పేరుపెట్టారు. ప్రైవేటులో ఇదే తొలి మిషన్‌ కాబట్టి ప్రారంభ్‌ మిషన్‌గా దీన్ని పిలుస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి 12గంటల మధ్యలో ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు.

Tags:    

Similar News