Modi Cabinet 3.0: నేడు కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం

Modi Cabinet 3.0: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.

Update: 2024-06-10 03:41 GMT

Modi Cabinet 3.0: నేడు కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం

Modi Cabinet 3.0: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇవాళ కేంద్ర కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనుంది. మొత్తం 71 మంది సభ్యులతో మోడీ మీట్ కానున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవాళ 100 రోజుల కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఇండియాకు పెట్టుబడుల ఆకర్షణ, వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు, పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2019లో కేబినెట్ సమావేశం కంటే ముందే శాఖల కేటాయింపు ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాగా కీలక మంత్రిత్వశాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకునే అవకాశం ఉంది. అటు ఏపీకి కేటాయించిన మంత్రి పదవులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారోననే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags:    

Similar News