మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది నవజాత శిశువులు సజీవ దహనం
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయూలో మంటలు చెలరేగి పది మంది నవజాత శిశువులు మృత్యువాతపడ్డారు.
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయూలో మంటలు చెలరేగి పది మంది నవజాత శిశువులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన బాంద్రా జిల్లా జనరల్ హాస్పిటల్‌లో జరిగింది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. మరో ఏడుగురు చిన్నారులను రక్షించినట్లు హాస్పిటల్ సివిల్ సర్జన్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది చిన్నారులు ఐసీయూలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సుమారు రాత్రి 2గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఓ నర్స్ గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించింది. ఆ తర్వాత ఆమె వెంటనే అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యను ప్రారంభించింది. మంటల నుంచి కాపాడిన పిల్లలను వేరే వార్డుల్లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇదంతా జరిగిందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.