Bihar Road Accident: బిహార్లోని వైశాలి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
* పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు, 8 మంది మృతి.. పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
Bihar: బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న పాదచారులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థిలికి చేరుకొని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైశాలి జిల్లాలోని మెహ్నార్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.