సాగు చట్టాలను ఆపుతారా..? స్టే ఇవ్వాలా? : కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్..

Update: 2021-01-12 02:45 GMT

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. నెలన్నర దాటినా సమస్యను కొలిక్కి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాల అమలును ఆపుతారా.. లేక తమనే స్టే ఇవ్వమంటారా..? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వానికి, రైతు సంఘాలకు జరుగుతున్న చర్చల తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేూసింది.

రైతుల ఆందోళన రోజు రోజుకు తీవ్రతరం అవుతుందని ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా రైతులు నిరసన చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. సమస్య సామరస్యంగా పరిష్కారమవ్వాలని చెప్తూ ఇందుకోసం ఓ రిటైర్డ్ సుప్రీం చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీ వేస్తామని స్పష్టం చేసింది. దీనిపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది.

కేంద్రంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడంతో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇవాళ మరోమారు విచారించి తీర్పు చెప్పనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి సరైన సమాధానం రాకపోతే సీజేఐ నేతృత్వంలో అధ్యాయన కమిటి వేయనుంది. 

Tags:    

Similar News