కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు

Update: 2020-12-09 11:06 GMT

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు చెబుతున్నారు. రైతు చట్టాలు రద్దు చేస్తారా లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కాసేపట్లో రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ తో విపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవర్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, డీఎంకే ఎంపీ ఎలన్గోవన్ రైతులతో కలిసి పాల్గొననున్నారు. రాష్ర్టపతితో భేటీకి ముందు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. 

Tags:    

Similar News