నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

* కేవలం కన్ఫర్మేషన్ కోసమే అయితే కస్టడీ అవసరం లేదన్న డిఫెన్స్ లాయర్.. సీబీఐ కస్టడీ పొడిగింపును నిరాకరించిన కోర్టు

Update: 2022-12-03 11:38 GMT

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ 

Central Bureau Of Investigation: నకిలీ CBI అధికారి శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీలోని సీబీఐ కోర్ట్. 14 రోజుల పాటు ఆయనను రిమాండ్‌కు పంపింది. శ్రీనివాస్‌కు కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. మరికొద్ది రోజులు కస్టడీ కావాలని కోర్టును సీబీఐ కోరింది. ఇప్పటికే సాక్షులను పిలిచి ప్రశ్నించినట్లు వెల్లడించింది. మొత్తం 11వందల ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను శ్రీనివాస్ ఫోన్ నుంచి సేకరించామని వాటిని అనువాదం చేయించాల్సి ఉందని సీబీఐ కోర్టుకు వివరించింది. కన్ఫర్మేషన్ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. కేవలం కన్ఫర్మేషన్ కోసమే అయితే సీబీఐ కస్టడీ అవసరం లేదని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఇప్పటివరకు ఆరుగురు సాక్షులను ప్రశ్నించామన్న సీబీఐ ఇంకా మరికొందరిని పిలిచి ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న సీబీఐ కోర్టు కస్టడీ పొడిగింపును నిరాకరించింది. శ్రీనివాస్‌ను జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. 

Tags:    

Similar News