Lawrence Bishnoi: అమెరికాలోనే అన్మోల్‌ బిష్ణోయ్‌.. భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ను ఇండియాకు రప్పించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Update: 2024-11-02 07:00 GMT

Lawrence Bishnoi: అమెరికాలోనే అన్మోల్‌ బిష్ణోయ్‌.. భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ను ఇండియాకు రప్పించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్మోల్ అమెరికాలోనే ఉన్నారని ఆ దేశ పోలీసులు భారత్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయనను ఇండియాకు రప్పించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో పాటు మరికొన్ని కేసుల్లో ఆయనపై ఆరోపణలున్నాయి. బాబా సిద్దిఖీని హత్య చేసిన ఆరుగురు నిందితులతో కూడా ఆయన టచ్ లో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్దిఖీ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఆయనపై అనుమానాలున్నందున ముంబై పోలీసులు ఆయనను ఇండియాకు రప్పించేందుకు అనుమతి కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సోషల్ మీడియా పోస్టుతో..

సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనకు సంబంధించి అన్మోల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పంజాబ్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు సిద్దూ మూసేవాలా హత్య కేసులోనూ ఆయనపై ఆరోపణలున్నాయి. మొత్తం 18 కేసులు ఆయనపై నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. అన్మోల్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

నకిలీ పాస్ పోర్టుతో పరారీ

నకిలీ పాస్ పోర్టుతో అన్మోల్ పారిపోయారు. భాను అనే పేరుతో ఆయన పాస్ పోర్టు పొందారని పోలీసులు గుర్తించారు.ఆయనపై నమోదైన కేసుల దర్యాప్తు సమయంలో ఈ నకిలీ పాస్ పోర్టు అంశాన్ని గుర్తించారు. అన్మోల్ ను విచారిస్తే లారెన్స్ గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News