జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం

Update: 2021-02-14 09:43 GMT

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రను భారత జవాన్లు భగ్నం చేశారు. జమ్మూ బస్టాండ్‌లో ఏడుకిలోల పేలుడు పదార్థాలను జవాన్లు గుర్తించారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ ముమ్మర తనిఖీలు చేపట్టింది. పుల్వామా ఉగ్రదాడికి నేటి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పేలుడుకు కుట్ర చేసినట్లు బలగాలు అనుమానిస్తున్నాయి.

రెండేళ్ల కిందట జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌కి చెందిన 40 మంది సైనికులు అమరులయ్యారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. 78 వాహనాల్లో 2500 మంది సైనికులు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. 

Tags:    

Similar News