Election Counting: గుజరాత్‌, హిమాచల్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Election Counting: గుజరాత్‌లో పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీకి 100కు పైగా ఆధిక్యం

Update: 2022-12-08 03:50 GMT

Election Counting: గుజరాత్‌, హిమాచల్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Election Counting: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. మళ్లీ అధికారం చేపడుతుందా..? పంజాబ్‌లో సత్తా చాటిన ఆప్‌.. సంచలనం సృష్టిస్తుందా..? కాంగ్రెస్‌ పునర్‌వైభవం సొంతం చేసుకుంటుందా..? అన్నది ఇవాళ తేలిపోనుంది. అయితే.. గుజరాత్‌లో మళ్లీ బీజేపీయే అధికారం చేపడుతుందని, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనా వేశాయి. దీంతో.. అందరి దృష్టి గుజరాత్‌ మీదే ఉన్నప్పటికీ.. హిమాచల్‌ప్రదేశ్‌ ఫలితాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.

గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 92 స్థానాల్లో గెలవాల్సి ఉంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో 68 స్థానాలు ఉండగా.. మెజార్టీ మార్కుకు 35 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు గుజరాత్‌లో బీజేపీ 130 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 40, ఆప్‌ 5, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక.. హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 39, కాంగ్రెస్‌ 27, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Tags:    

Similar News