పార్వో వైరస్ తో కుక్కల మృత్యువాత

Parvo virus: ఉత్తరప్రదేశ్‌లో పార్వో వైరస్‌ వల్ల 8 చిన్న కుక్కలు మరణించాయి.

Update: 2021-02-27 01:16 GMT

ఫైల్ ఇమేజ్


ఉత్తర్ ప్రదేశ్ : గత సంవత్సర కాలంగా మనుషులను కరోనా వైరస్ వణికిస్తుండగా మరోవైపు పక్షులు, జంతువులను కొన్ని రకాల వైరస్‌లు పట్టి పీడిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పార్వో వైరస్‌ వల్ల 8 చిన్న కుక్కలు మరణించాయి. కాన్పూర్‌ జిల్లా భీతర్‌గావ్ ప్రాంతంలోని క్యోంటారా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన రెండు శునకాలకు పోస్ట్‌మార్టం నిర్వహించగా పార్వో వైరస్‌ వల్ల అవి చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఇదే గ్రామంలో ఇటీవల ఏవియన్‌ ఫ్లూ కారణంగా వందల సంఖ్యలో కాకులు మరణించాయి. తాజాగా పార్వో వైరస్‌తో చిన్న కుక్కలు చనిపోవడంతో పశువైద్యుల బృందం గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలోని మరిన్ని కుక్కలకు ఈ వైరస్ సోకి ఉంటుందా అన్నది పరిశీలిస్తున్నది. 

Tags:    

Similar News