Cyclone Biparjoy: తుఫాన్ ప్రభావంతో ద్వారకలో ఆలయం మూసివేత
Cyclone Biparjoy: దేవభూమి ద్వారకలో ఆలయం మూసివేత
Cyclone Biparjoy: బిపర్‌జాయ్ తుఫాను నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. తుఫాను హెచ్చరికలతో దేవభూమి ద్వారకలోని ద్వారకాధిశ్ ఆలయాన్ని మూసివేశారు. దేవాలయంలోకి భక్తులను అనుమతించేది లేదని తెలిపారు. కాగా, బిపర్‌జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 70 గ్రామాలకు చెందిన 75 వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలు సహా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.
గాలుల వేగం పెరగడంతో తీర ప్రాంతాల్లో 4 వేల హోర్డింగులను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. బిపర్‌జాయ్ తుఫాను ఈ నెల 16న రాజస్థాన్‌పైనా ప్రభావం చూపనుందని ఐఎమ్‌డీ వెల్లడించింది. మరోవైపు తుఫాను తమ జీవనోపాధిపై ప్రభావం చూపవచ్చని నౌకల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు.