Kerala: వరకట్న నిషేధ నిబంధనలను సవరిస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

Kerala: వరకట్న నిషేధ నిబంధనలను సవరిస్తూ కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-07-17 12:47 GMT

కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి

Kerala: వరకట్న నిషేధ నిబంధనలను సవరిస్తూ కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలో వరకట్న వేధింపులు పెరిగిపోతున్న తరుణంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకూ వరకట్న నిషేధ అధికారులను నియమించేందుకు వీలు కల్పిస్తూ నిబంధనలను తీసుకొచ్చింది.

ప్రస్తుతం తిరువనంతపురం, ఎర్నాకుళం, కొజిక్కోడ్ జిల్లాల్లో వరకట్న నిషేధ అధికారులు ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి తెలిపారు. ఇకపై అన్ని జిల్లాల్లోనూ వరకట్న నిషేధ అధికారులను నియమిస్తామన్నారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులు వరకట్న నిషేధ అధికారులుగా వ్యవహరిస్తారని వెల్లడించిన మంత్రి.. చీఫ్ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్‌గా మహిళా, శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

Tags:    

Similar News