మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టిన లాక్‌డౌన్.. ఒక్కసారిగా పెరిగిన గృహ హింస కేసులు..

Update: 2020-04-14 10:34 GMT

లాక్‌డౌన్‌ వనితలను వణికిస్తోంది. ఇంటిపనులకు ఆటంకంగా మారుతోంది. స్వేచ్ఛను హరించడంతో పాటు మానసికఒత్తిడికి గురవుతున్నారు. ఇంట్లో అందరూ ఉన్న ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఇంతకి వారికి ఏమైందో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

కరోనా వైరస్‌ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది. భర్త, పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం చేసింది. ఓ వైపు కుటుంబ సభ్యుల్లో ఆప్యాయత, అనురాగాలు పెరిగితే మరోవైపు ఇల్లాలికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇంటిపనులన్నింట్లో నేను సైతం అని దూసుకుపోతున్న వనితలకు కొత్త కష్టాలు పలికరిస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస గణనీయంగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. సొంత ఇంట్లోనే వారికి రక్షణ కరువైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

లాక్‌డౌన్‌తో భర్తలు తమ అసహనాన్ని భార్యలపై చూపుతున్నట్లు కేసులను బట్టి తెలుస్తోంది. మందు, ఉద్యోగ భద్రత, జీతాలతో కోత, వ్యాపారాలు కుంచిందుకు పోవడంతో ఏర్పడిన అసహనాన్ని ఇంట్లో ఉండే జీవిత భాగస్వామిపై చూపుతున్నారు. 24 గంటలు భర్తలతో కలసి ఉండటంతో గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు తమ గోడును ఎవరికి, ఎలా చెప్పకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో గృహసింహ, మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. అవగాహన ఉన్న వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లు వదిలి బయటికి రాలేని వందల మంది హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. గృహ హింసకు సంబంధించి 95 ఫిర్యాదులు అందాయి. మరికొందరు ఎవరికి ఎలా చెప్పుకోవాలో తెలియక బాధను గుండె లోతుల్లో కోపాన్ని, పంటి బిగువన దాచుకొని ఉండిపోతున్నారు. రోజుకు సగటున 15 నుంచి 20 ఫోన్లు వస్తున్నాయంటు పరిస్థితులు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

Tags:    

Similar News