Delhi Mayor Election: ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా
Delhi Mayor Election: ఆప్, బీజేపీ కౌన్సిలర్ల ఘర్షణతో ఎన్నిక వాయిదా
Delhi Mayor Election: ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆప్, బీజేపీ కౌన్సిలర్ల ఘర్షణతో ఎన్నిక వాయిదాకు కారణమైంది. ఇరు పార్టీల కౌన్సిలర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తదుపరి నోటీస్ వచ్చే వరకు ఎన్నిక వాయిదా పడింది. మేయర్ ఎన్నికకు ముందే నామినేటెడ్ సభ్యులు ప్రమాణం చేసే విషయం వాగ్వాదానికి కారణమైంది. నామినేటెడ్ సభ్యుల ప్రమాణంపై ఆప్ ఆభ్యంతరం వ్యక్తం చేసింది. ముందు నామినేటెడ్ సభ్యుల ప్రమాణంపై నిరసన తెలిపారు. ప్రమాణ స్వీకారానికి మనోజ్ కుమార్‌ను ఆహ్వానించడంతపై అభ్యంతరం చెప్పిన ఆప్ సభ్యులు మండిపడ్డారు. కౌంటర్‌గా బీజేపీ కౌన్సిలర్లు నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాల వాగ్వాదంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మరోవైపు 10 మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను తమను సంప్రదించకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొనడాన్ని ఆప్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఇదంతా ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకునే కుట్రలో భాగమని ఆప్ నేతలు మండిపడుతున్నారు. నామినేటెడ్ సభ్యులతో ప్రమాణం చేయించి మేయర్ కుర్చీ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మేయర్ ఎన్నిక జరగనుండగా వ్యూహం ప్రకారమే బీజేపీ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటోందని ఆప్ నేతలుమండిపడుతున్నారు.