Delhi: ఢిల్లీ మున్సిపల్‌ మేయర్‌ ఎన్నిక

Delhi: సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహణ

Update: 2023-01-06 06:49 GMT

Delhi: ఢిల్లీ మున్సిపల్‌ మేయర్‌ ఎన్నిక

Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వాడి వేడిగా జరుగుతోంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మెజారిటీ తక్కువ ఉన్నప్పటికీ మేయర్‌ పదవికి బీజేపీ పోటీ పడటం ఆసక్తిగా మారింది. మేయర్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో 134 ఆప్‌, 104 స్థానాల్లో బీజేపీ , 9చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందాయి. ఓటమి కారణంగా మేయర్‌ పదవికి పోటీ చేయబోమని బీజేపీ ప్రకటించినా తాజాగా బరిలో నిలవడంతో ఎంసీడీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

ఆప్‌ తరపున షెల్లీ ఒబెరాయ్‌ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. డిప్యూటీ మేయర్‌ పోస్ట్‌ కోసం ఆప్‌ నుంచి ఆలె ముహమ్మద్‌ ఇక్బాల్‌, జలాజ్‌ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్‌ బార్గీలు పోటీ పడుతున్నారు. ఢిల్లీ మేయర్‌ పదవి ఐదేళ్లలో ప్రతి ఏడాదికి మారుతుంటుంది మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్‌ కాగా రెండో ఏడాది ఓపెన్‌ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్‌ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్‌ కేటగిరీ కింద మేయర్‌ అభ్యర్థిని ఎన్నుకుంటారు.

Tags:    

Similar News