Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ సహా 30 చోట్ల ఈడీ సోదాలు
Liquor Scam: హైదరాబాద్‌లో రామచంద్రన్ పిళ్లై ఇంట్లో ఈడీ సోదాలు
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సోదాలు కొనసాగుతోన్నాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ వ్యవహారంపై కేసుకు సంబంధించి ఈడీ హైదరాబాద్ సహా ప్రధాన నరగాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబై, లక్నో, బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతోన్నాయి. హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండగా.. అరుణ్ రామచంద్రపిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లలో దాడులు చేపట్టారు. అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో సహా రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో తనిఖీలు జరుగుతున్నాయి.
కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలపై.. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా, సహా పలువురిని ఈడీ అధికారులు విచారించారు. దీంతోపాటు ఈ స్కాంలో పలువురి హస్తంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఈడీ ఈ కేసులో దూకూడు పెంచినట్లు తెలుస్తోంది.