Delhi Budget 2024: మహిళలకు ఢిల్లీ ప్రభుత్వ కానుక.. ప్రతి నెల అకౌంట్లో రూ.1000
Delhi Budget 2024: 18 ఏళ్లు దాటిన మహిళల ఖాతాలో ప్రతి నెల రూ.వెయ్యి
Delhi Budget 2024: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయిలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి అతిషి 76 వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పేరుతో సరికొత్త పథకాన్ని ఆమె ప్రకటించారు. ఈ స్కీమ్ కింద 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న మహిళలకు నెలకు వెయ్యి రూపాయిలు ఇవ్వనున్నట్లు అతిషి చెప్పారు. విద్యారంగానికి 16 వేల 369 కోట్లు, ఆరోగ్య రంగానికి 8 వేల 685 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు.