No Confidence Motion: ఇవాళ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రేపు ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం

No Confidence Motion: అవిశ్వాసం తీర్మానంపై చర్చ నేపథ్యంలో రాహుల్ రాజస్థాన్ పర్యటన రద్దు

Update: 2023-08-09 02:47 GMT

No Confidence Motion: ఇవాళ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రేపు ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం  

No Confidence Motion: కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇవాళ రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మోషన్‌పై చర్చలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో జరిగే ర్యాలీలో ప్రసంగించేందుకు వెళ్లాలని భావించారు. కానీ అవిశ్వాస తీర్మానం మధ్యాహ్నం స్లాట్‌కు మారే అవకాశం ఉన్నందున రాహుల్ గాంధీకి బదులుగా ప్రియాంక గాంధీ రాజస్థాన్‌కు వెళ్లాలని నిర్ణయించారు. ఆగస్టు 10 వరకు అవిశ్వాసంపై చర్చ కొనసాగుతుందని, అదే రోజున తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చర్చను ప్రారంభించారు. రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని స్పీకర్‌కు తెలియజేసినప్పుడు ఆయన ఎందుకు చర్చను ప్రారంభించడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అడిగారు. బీజేపీకి చెందిన కొందరు పెద్ద నేతలు మాట్లాడిన తర్వాతే మాట్లాడాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.

చివరి నిమిషంలో రాహుల్ గాంధీ వైదొలగడం వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ముందుగా మాట్లాడి ఉంటే ఆయన దాడికి గురికాకూడదనే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ చేయబోయే ప్రసంగంపై కాంగ్రెస్ పక్ష నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News