Delhi: పొలిటికల్ టర్న్ తీసుకున్న కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతి

Delhi: ఢిల్లీలో కోచింగ్ సెంటర్‌‌లో విద్యార్థుల మృతి.. పొలిటికల్ టర్న్ తీసుకుంది.

Update: 2024-07-28 06:48 GMT

Delhi: పొలిటికల్ టర్న్ తీసుకున్న కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతి

Delhi: ఢిల్లీలో కోచింగ్ సెంటర్‌‌లో విద్యార్థుల మృతి.. పొలిటికల్ టర్న్ తీసుకుంది. స్టూడెంట్స్ మృతికి ఆప్ సర్కార్ కారణమంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఆప్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా.. విద్యార్థులు మృతి చెందారంటూ బీజేపీ ధర్నాకు దిగింది. కోచింగ్ సెంటర్ ఓనర్.. కో-ఆర్డినేటర్‌లను అరెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోచింగ్ సెంటర్లు ఉన్న రాజేందర్‌నగర్, కరోల్‌బాగ్‌లో తనిఖీలు చేయాలని ఢిల్లీ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మృతులు తానియా సోని, శ్రేయా యాదవ్, నెవిన్ డాల్విన్‌‌గా గుర్తించారు. కోచింగ్‌ సెంటర్‌లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

కాగా ఈ ఘటనపై 24 గంటల్లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించామన్నారు.

Tags:    

Similar News