వారికి ఫిబ్రవరి 28 డెడ్‌లైన్.. ఈ పని పూర్తి చేయకపోతే ఆర్థికంగా చాలా నష్టం..?
వారికి ఫిబ్రవరి 28 డెడ్‌లైన్.. ఈ పని పూర్తి చేయకపోతే ఆర్థికంగా చాలా నష్టం..?
Pensioners: పెన్షన్ దారుంలందరు ఫిబ్రవరి 28లోగా తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని (life certificate) సమర్పించడం తప్పనిసరి. లేదంటే పెన్షన్ ఆగిపోతుంది. పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం 28 ఫిబ్రవరి 2022 వరకు పొడిగించింది. వాస్తవానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 30 చివరి తేదీగా నిర్ణయిస్తారు. కానీ కరోనా కాలం దృష్ట్యా ఈ గడువును ఫిబ్రవరి 28కి పెంచారు. మీరు లైఫ్ సర్టిఫికెట్‌ని ఈ విధంగా సమర్పించవచ్చు.
జీవన్ ప్రమాణ్ పోర్టల్ https://jeevanpramaan.gov.in/ లో మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు . ఇందుకోసం ముందుగా జీవన్ ప్రమాణ్ యాప్‌ను పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది కాకుండా UDAI ద్వారా ధృవీకరించిన వేలిముద్ర పరికరం ఉండాలి. తర్వాత మీరు స్మార్ట్‌ఫోన్, యాప్‌లో పేర్కొన్న పద్ధతుల ద్వారా ఈ మెయిల్ ఐడిని ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వ్యక్తులు ఈ సర్టిఫికెట్‌ను స్వయంగా బ్యాంకు శాఖలను సందర్శించడం ద్వారా సమర్పించవచ్చు.
పెన్షనర్లు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఈ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, UCO బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.