Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనున్న బిపర్ జోయ్‌

కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌, గుజరాత్‌. కేరళ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

Update: 2023-06-10 06:03 GMT

Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనున్న బిపర్ జోయ్‌

Cyclone Biparjoy: బిపర్‌ జోయ్ తుఫాన్ ఉత్తర- ఈశాన్యల వైపు పయనిస్తున్నందున మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య అరేబియా సముద్రం వద్ద తీవ్రరూపం దాల్చింది. మరో మూడు రోజుల్లో తుఫాను ఉత్తర వాయువ్య దిశగా దూసుకుపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ భారత దేశంలో మోస్తరుగా- అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కేరళ, కర్ణాటక తీరప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, లక్షద్వీప్‌లో ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Tags:    

Similar News