Cyclone Biparjoy: ముంబాయి పై బిపోర్ జాయ్ ఎఫెక్ట్.. విమాన రాకపోకలకు అంతరాయం
Cyclone Biparjoy: గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను తీవ్ర రూపం దాల్చింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాన్ ప్రభావంతో ముంబాయిలో బీకర గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమానాలను ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో మరో ఎయిర్‌పోర్టుకు దారిమళ్ళిస్తున్నారు.
ఇదే అంశాన్ని ఎయిరిండియా గత రాత్రి ట్విటర్ ద్వారా తెలిపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముంబయి ఎయిర్‌పోర్టులోని 09/27 రన్‌వేను తాత్కాలికంగా మూసివేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, ప్రయాణ ఆలస్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.విమానాల ఆలస్యంతో ఎయిర్ పోర్ట్ లోనే గంటల తరబడి ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. తమకు సరైన సౌకర్యాలు కూడా కల్పించాలని సోషల్‌మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.