CRPF, BSF to Drop Jawans: జవాన్ గా ఉండాలంటే ఫిట్ గా వుండాల్సిందే
CRPF, BSF to Drop Jawans: శారీరక దారుఢ్యం లేని సిబ్బందిని కొలువు నుంచి సాగనంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
CRPF, BSF to Drop Jawans: ఫిట్ నెస్ ఇప్పుడు అన్నిచోట్లా ఇది ముఖ్యమై పోయింది. ఆరోగ్యంగా ఉండాలన్నా ఫిట్ నెస్ ఉండాల్సిందే.. ఈ కరోనా కాలంలో ఉద్యోగం చేయాలన్నా పిట్ నెస్ కావాల్సిందే. మరి సామాన్యుల పరిస్ధితే ఇలా ఉంటే.. ఇక దేశాన్ని కాపాడాల్సిన జవాన్లకు ఫిట్ నెస్ ఏ రేంజ్ లో ఉండాలి మరి. అవును అందుకే కేంద్రం ఇప్పుడు దానిపై ఫోకస్ పెట్టింది. ఫిట్ నెస్ లేనివారు.. దానిని పెంచుకోలేనివారు జవాన్ గా ఉండటానికి అనర్హులని కేంద్రం భావిస్తోంది. అందుకే అలాంటివారిని గుర్తించి సాగనంపాలని నిర్ణయించింది.
కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్), సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లలో శారీరకంగా దారుఢ్యంగా లేని సిబ్బందిని కొలువు నుంచి సాగనంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనర్హమైన సిబ్బందిలో కొన్ని వందల మందిని అన్‌ఫిట్ క్రింద తొలగించాలని భావిస్తోంది. కేంద్ర పారామిలిటరీ దళాల్లో అతి తక్కువ ఆరోగ్య ఫిట్‌నెస్ కలిగిన జవాన్లను గుర్తించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
శారీరకంగా దారుఢ్యం లేనివారిని 'షేప్-5'గా పిలుస్తుంటారు. ఈ రెండు భద్రతాదళాల నుంచి షేప్-5 జవాన్లను ముందే రిటైర్ చేయించి పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ రెండు దళాలు హోం శాఖ పరిధిలోకి వస్తాయి. రెండింటిలోనూ 40-45 ఏళ్ల వయసు మధ్య ఉన్న కొన్ని వందల మంది ఫిట్‌నెస్ కోల్పోయారని అధికారులు గుర్తించారు.
''వీరిలో చాలామంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, కశ్మీర్‌లోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి కీలకమైన చోట్ల శారీరకంగా దృఢంగా లేనివారిని ఉంచటం మంచిది కాదు'' అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. గతంలో ఇలా దారుఢ్యంలేనివారిని పోరాట ప్రాంతాల నుంచి తొలగించి, అడ్మినిస్ట్రేషన్ పనులు అప్పగించేవారు. కానీ, ఈసారి వారికి సర్వీసు నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలతో ముందస్తు రిటైర్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు.