Covid Vaccine: నేటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్

Covid Vaccine: దేశవ్యాప్తంగా నేటి నుంచే అమలు * వ్యాక్సిన్‌ వృథాను తగ్గించాలని సూచన

Update: 2021-04-01 01:37 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covid Vaccine: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ ఉధృతరూపం దాలుస్తుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషనల్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అలాంటి ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది.

నేటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్​ ఇవ్వనున్నట్లు డీహెచ్‌ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలో 45 ఏళ్లు దాటినవారు సుమారు 80 లక్షల మంది ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి విడత టీకా ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలున్న 45 ఏళ్లు దాటినవారికి టీకా వేసినట్లు స్పష్టం చేశారు.

దాదాపు 10 లక్షల మందికి తొలి విడత టీకా ఇచ్చామన్నారు. రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వెయ్యి ప్రభుత్వ, 250 ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రెండు వారాలుగా వ్యాక్సినేషన్‌కు మంచి స్పందన లభించిందని వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని కేంద్రం సూచిందన్నారు. 

Tags:    

Similar News