Covid-19 vaccine: నేడు దేశవ్యాప్తంగా మరో విడత కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
Covid-19 vaccine: * రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో డ్రై రన్ * వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే లోటుపాట్లు గర్తించేందుకు డ్రై రన్ * డ్రై రన్ ఫలితాల ఆధారంగా చేపట్టనున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇక వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ కొనసాగుతోంది. కరోనా టీకా పంపిణీ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రలలోనూ మరోసారి డ్రై రన్ కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో ఈ డ్రై రన్‌ను చేపట్టనున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే లోటుపాట్లు గుర్తించేందుకు డ్రై రన్ చేపట్టనున్నారు. డ్రై రన్ ఫలితాల ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సిన్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దఫాగా ఆరోగ్య వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. అయితే నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి మొత్తం 78వేల 226 మందిని గుర్తించారు. అయితే నగరంలో మొత్తం 260 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. ప్రతి కేంద్రంలో రోజుకు వంద మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు
అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించనున్న కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌ను విజయవంతం చేసేందుకు 12 మంది వైద్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో 8 ప్రధాన ఆస్పత్రుల్లో డ్రైరన్ నిర్వహించనున్నట్లు చెప్పారు.