కరోనా టెస్టు : రూ.2,500 నుంచి1,600 కు తగ్గింపు

వివిధ రాష్ట్రాల్లో కరోనా టెస్టులు ఉచితంగానే చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు.. అయితే టెస్టులు చేయించుకునే వారు ఎక్కువ కావడంతో ప్రభుత్వం ప్రైవేటు ల్యాబులకు అనుమతి ఇచ్చింది. ఇందుకొసం ధరను కూడా నిర్ణయించాయి. అయితే కొన్నిచోట్ల ఎక్కువగాను.. మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువగాను కోవిడ్ టెస్టు ధరలు ఉన్నాయి..

Update: 2020-09-11 05:02 GMT

ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారు కరోనా టెస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్‌లలో నిర్వచించే కోవిడ్ -19 పరీక్షల రేట్లను సవరించింది. కోవిడ్ టెస్టుకు రూ .2,500 కు బదులుగా రూ .1,600 మాత్రమే వసువులు చేయాలనీ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. పరీక్షల్లో ఉపయోగించే మెటీరియల్ ధర తగ్గడం, హేతుబద్ధీకరణను దృష్టిలో ఉంచుకుని టెస్టు ఛార్జిని తగ్గించింది. ఇతర రాష్ట్రాలలో ప్రైవేటు ల్యాబులు ఎక్కువ రేట్లకే టెస్టులు నిర్వహిస్తున్నాయని అదనపు ప్రధాన కార్యదర్శి (ఆరోగ్య) అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. సవరించిన ఈ ఆర్డర్ వెంటనే అమలులోకి వస్తుందని మెడికల్ హెల్త్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డిఎస్ నెగి చెప్పారు.

ట్రూనాట్ ద్వారా నిర్ధారణ పరీక్ష ధర కూడా రూ .1,600 గా నిర్ణయించబడిందని.. ఎవరైనా పరీక్ష కోసం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే అంటువ్యాధి ఉల్లంఘన చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని ప్రసాద్ ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా కోవిడ్ పరీక్షకు ధర తగ్గించడం ఇది రెండోసారి. ప్రైవేటు ల్యాబ్‌లను మొదట ఆర్టీ-పిసిఆర్ ద్వారా పరీక్షకు అనుమతించినప్పుడు, ప్రతి పరీక్షకు రుసుము రూ .4,500 గా నిర్ణయించి, ఆ తరువాత దీనిని రూ.2,500 కు తగ్గించారు. తాజాగా ప్రతి పరీక్షకు 1,600 రూపాయలు నిర్ణయించారు. కోవిడ్ పరీక్ష ధర తగ్గింపు అనేది స్వాగతించవలసిన అంశమని అంతర్జాతీయ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ అభిషేక్ శుక్లా అన్నారు.

Tags:    

Similar News