కోవిడ్ వ్యాక్సిన్ ధరను నిర్ధారించిన కేంద్రం

Update: 2021-02-27 14:50 GMT

కోవిడ్ వ్యాక్సిన్ ధరను నిర్ధారించిన కేంద్రం

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఒక్కో డోసు టీకా ధరను 250గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ ధర 150 కాగా.. 100 రూపాయలు సర్వీస్ ఛార్జ్‌గా ఆస్పత్రులు వసూలు చేస్తాయని తెలిపింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం వ్యాక్సిన్ ఉచితంగానే ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మార్చి ఒకటి నుంచి పబ్లిక్ డొమైన్‌లోకి కోవిడ్ వ్యాక్సిన్ రానుంది. ఇక తెలంగాణలో 12 వందల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుండగా రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించనున్నారు.

Tags:    

Similar News