Corona Cases in Delhi: లాక్‌డౌన్ అమలుతో ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం
Corona Cases in Delhi: ఢిల్లీలో మరోవారం రోజులపాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.
Corona Cases in Delhi: ఢిల్లీలో మరోవారం రోజులపాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఇక యూపీ సర్కార్ కూడా ఢిల్లీ బాటలో నడుస్తూ మరోవారం పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తెలియజేసింది. పోతే లాక్‌డౌన్ అమలుతో ఢిల్లీలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది.
లాక్‌డౌన్ అమలుతో ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ నియంత్రణకి ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక ఈ చర్యలను మధ్యలో వదిలేయకూడదన్న ఉద్దేశంతో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరోవారం రోజులపాటు పొడిగించగా అది ఈనెల 17 ఉదయం 5గంటల వరకు అమలుకానున్నట్లు సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఇక ఈసారి కోవిడ్ ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతోపాటు రాజధానిలో మెట్రో సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్‌లో మధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35శాతం ఉండగా అది ఇప్పుడు 23శాతానికి చేరుకుందని తెలిపారు. ఇది కూడా చాలా ఎక్కువని కరోనా వ్యాప్తిని మరింత అరికట్టాల్సిందేనని తనతో వైద్యులు చెప్పినట్లు సీఎం కేజ్రీవాల్ తెలియజేశారు. అందుకే తాము మరోవారం పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
అటు కరోనా సెకండ్‌వేవ్‌లో కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈనెల 17 వరకూ పొడిగించింది. మే 17వ తేదీ ఉదయం 7 గంటల వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉండనుండగా అన్ని దుకాణాలు, వాణిజ్య సంస‌్ధలు మూసే ఉంటాయని అధికారులు చెప్పారు. కోవిడ్ చైన్‌ను తుంచే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఇ-ఫాస్‌లు తప్పనిసరిగా పొందాలని వెల్లడించింది.